Hyderabad, ఆగస్టు 29 -- ఇప్పటి దాకా 2025లో ఒక చంద్ర గ్రహణం, ఒక సూర్య గ్రహణం ఏర్పడ్డాయి. కానీ అవి మన భారతదేశంలో కనపడలేదు. రెండవ చంద్ర గ్రహణం భారత దేశంలో కనపడుతుంది. 2025లో రెండవ చంద్రగ్రహణం సెప్టెంబర్ 7న ఏర్పడుతుంది. ఇది సంపూర్ణ చంద్రగ్రహణం. ఈ గ్రహణం రాత్రి 9:58కి మొదలై, సెప్టెంబర్ 8 తెల్లవారుజామున 1:26 వరకు ఉంటుంది.

గ్రహణ వ్యవధి మొత్తం 3.28 నిమిషాలు. సెప్టెంబర్ 7 రాత్రి 11:42 గంటలకు చంద్రుడు సంపూర్ణంగా కనపడడు. సంపూర్ణ గ్రహణం సెప్టెంబర్ 8 తెల్లవారుజామున 1:26కు ముగుస్తుంది. ఈ గ్రహణం భారతదేశంలో కనపడుతుంది. కనుక సూతక కాలం చెల్లుతుంది. గ్రహణ సమయంలో మంత్రాలను జపించడం, దానధర్మాలు చేయడం మంచి ఫలితం ఇస్తుంది.

భాద్రపద మాసంలోని పౌర్ణమి రోజున భారత కాలమానం ప్రకారం రాత్రి 9:58 గంటలకు చంద్రగ్రహణం ప్రారంభమై మరుసటి రోజు తెల్లవారుజామున 1:26 గంటల వరకు ఉంటు...