Hyderabad, ఆగస్టు 29 -- భాద్రపద మాసంలోని శుక్ల పక్ష ఏకాదశిని పరివర్తని ఏకాదశి అని పిలుస్తారు. ఈ ఏడాది సెప్టెంబర్ 03న ఉదయం 04:53 గంటలకు ప్రారంభమై మరుసటి రోజు సెప్టెంబర్ 04న ఉదయం 04:21 గంటలకు ముగుస్తుంది. అందుకే సెప్టెంబర్ 3న జరుపుకోవాలి. ఈ ఉపవాసం గురించి శ్రీకృష్ణుడే స్వయంగా యుధిష్ఠిరుడికి చెప్పాడు. ఈ ఏకాదశి నాడు ఉపవాసం ఉండి ఆరాధించడం వల్ల బ్రహ్మ, విష్ణువుతో సహా మూడు లోకాలను పూజించిన ఫలితం లభిస్తుంది. దీని ప్రాముఖ్యత ఏమిటి?, ఆ రోజు ఏం చెయ్యాలి మొదలైన విషయాలను తెలుసుకుందాం.

ప్రతీ ఏకాదశిలానే పరివర్తిని ఏకాదశి నాడు కూడా ఉపవాసం ఉంటే మంచిది. సూర్యోదయం సమయంలో నిద్ర లేచి తలస్నానం చేసి పూజ మందిరాన్ని శుభ్రం చేసుకోవాలి. ఆ తర్వాత లక్ష్మీనారాయణులను భక్తి శ్రద్ధలతో ఆరాధించాలి. చక్కెర పొంగలి, పులగం వంటి ప్రసాదాలను నైవేద్యంగా పెట్టాలి. చేమంతులతో నారాయణ...