భారతదేశం, సెప్టెంబర్ 18 -- బాపట్ల జిల్లాలోని సూర్యలంక బీచ్ ఫెస్టివల్‌ను ఈ నెల 26 నుంచి 28 వరుకు నిర్వహించాలని మంత్రుల బృందం నిర్ణయించింది. ఈ కార్యక్రమానికి జరుగుతున్న ఏర్పాట్లను అంచనా వేయడానికి సచివాలయంలో మంత్రుల బృందం సమీక్షా సమావేశం నిర్వహించింది. మంత్రులు కొలుసు పార్థసారథి, కొల్లు రవీంద్ర, అనగాని సత్య ప్రసాద్, గొట్టిపాటి రవి కుమార్ లు ఈ ఉత్సవాన్ని సజావుగా నిర్వహించడానికి అధికారులకు ఆదేశాలు జారీ చేశారు.

సాహస క్రీడలు, ప్రదర్శనలు, లేజర్ షో, సాంస్కృతిక కార్యక్రమాలకు ఏర్పాట్లు చేయడంతో పాటు క్రీడా సౌకర్యాలు, అవసరమైన సౌకర్యాలు, ప్రాథమిక మౌలిక సదుపాయాలను కల్పించాలని అధికారులకు మంత్రులు సూచించారు. 27వ తేదీన సీఎం చంద్రబాబు సూర్యలంక బీచ్‌ను సందర్శించి రూ.97 కోట్ల విలువైన అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేస్తారని తెలిపారు.

'సూర్యలంక బీచ్‌కు వచ్చే సం...