Hyderabad, సెప్టెంబర్ 8 -- చంద్రగ్రహణం, సూర్యగ్రహణం ఏది ఏర్పడిన సరే దానికి తగ్గట్టుగా పరిహారాలను పాటించడం, సూతక కాలం ఇలాంటివన్నీ చూసుకుంటూ ఉంటారు. సెప్టెంబర్ 21న ఏర్పడనుంది. పితృపక్షంలో ఆఖరి రోజున అనగా భాద్రపద అమావాస్య నాడు ఈ సూర్య గ్రహణం ఏర్పడనుంది. ఈ సూర్య గ్రహణానికి సంబంధించి కొన్ని ముఖ్యమైన వివరాలని ఇప్పుడు తెలుసుకుందాం.

ఈ సూర్యగ్రహణం భారతదేశంలో కనపడదు. ఆస్ట్రేలియా, న్యూజిలాండ్, ఫిజి, అంటార్కిటికాలోని కొన్ని ప్రాంతాలలో ఈ సూర్యగ్రహణం కనపడుతుంది.

సూర్య గ్రహణం భాద్రపద కృష్ణపక్ష అమావాస్య సెప్టెంబర్ 21న రాత్రి 11:00 గంటలకు మొదలై, అర్ధరాత్రి 2:03 నిమిషాలకు ముగుస్తుంది. ఈ సూర్య గ్రహణం ఉత్తర పాల్గుణి నక్షత్రంలో, కన్యా రాశిలో ఏర్పడుతుంది. ఈ గ్రహణం ఏర్పడినప్పుడు సూర్యుడు, చంద్రుడు, బుధుడు కన్యా రాశిలో సంచరిస్తుంటారు.

కుజుడు తులా రాశిలో ఉంటాడ...