Hyderabad, సెప్టెంబర్ 10 -- ప్రతి సంవత్సరం భాద్రపద అమావాస్యను మహాలయ అమావాస్య అని అంటారు. ఈ సంవత్సరం మహాలయ అమావాస్య ఎప్పుడు వచ్చింది? ఆ రోజు ఏమి చేస్తే మంచిది? మహాలయ అమావాస్య విశిష్టత ఏంటి? మొదలైన విషయాలను ఇప్పుడు తెలుసుకుందాం.

ఈ సంవత్సరం మహాలయ అమావాస్య సెప్టెంబర్ 21న వచ్చింది. ఆ రోజు ఆదివారం. మన హిందూ సంప్రదాయంలో అమావాస్యకు ఉన్న విశిష్టత ఇంతా అంతా కాదు. అందులోనూ మహాలయ అమావాస్య ప్రత్యేకమైనది. మహాలయ అమావాస్య నాడు శుభకార్యాలు చేయకూడదు. ఈ అమావాస్యకు ఎంతో విశిష్టత ఉంది. పైగా ఆదివారం రావడం మరో విశేషం. మహాలయ అమావాస్య నాడు కొన్ని పరిహారాలను పాటించడం వలన పితృ దోషాల నుంచి బయట పడచ్చు.

గరుడ పురాణం ఏమి చెప్తోందంటే- మనిషి జీవితకాలంలో మూడు రుణాలను తప్పక తీర్చుకోవాలని, ఒకటి దేవత రుణం, ఇంకొకటి ఋషి రుణం, మూడవది పితృ ఋణం. ఈ రుణాలు తప్పనిసరిగా తీర్చుకోవాలి...