భారతదేశం, సెప్టెంబర్ 17 -- డిసెంబర్ నెలకు సంబంధించి శ్రీవారి ఆర్జితే సేవా టికెట్లను టీటీడీ విడుదల చేయనుంది. తిరుమ‌ల శ్రీ‌వారి ఆర్జిత సేవా టికెట్లకు సంబంధించిన డిసెంబర్ నెల కోటాను సెప్టెంబర్ 18న ఉదయం 10 గంట‌ల‌కు టీటీడీ ఆన్‌లైన్‌లో విడుదల చేయ‌నుంది. ఈ సేవా టికెట్ల లక్కీడిప్ రిజిస్ట్రేన్ కోసం సెప్టెంబర్ 20వ తేదీ ఉదయం 10 గంటల వరకు ఆన్‌లైన్‌లో నమోదు చేసుకోవచ్చు.

ఇక అంగ ప్రదక్షిణ టోకెన్లను కూడా ఈ నెల నుండి ఆన్‌లైన్‌లో లక్కీడిప్ ద్వారా జారీ చేయనున్నారు. ఈ టికెట్లు పొందిన వారు సెప్టెంబర్ 20 నుండి 22వ తేదీ మధ్యాహ్నం 12 గంటల లోపు సొమ్ము చెల్లించిన వారికి లక్కీడిప్‌లో టికెట్లు మంజూరవుతాయి.

కల్యాణోత్సవం, ఊంజల్ సేవ, ఆర్జిత బ్రహ్మోత్సవం, సహస్రదీపాలంకార సేవ టికెట్లను సెప్టెంబర్ 22న ఉదయం 10 గంటలకు టీటీడీ ఆన్ లైన్ లో విడుదల చేయ‌నుంది. 22న ఆర్జిత సేవా టి...