Hyderabad, ఆగస్టు 28 -- గ్రహాలు ఎప్పటికప్పుడు ఒక రాశి నుంచి మరో రాశిలోకి ప్రవేశించినప్పుడు శుభ యోగాలు, అశుభ యోగాలు ఏర్పడతాయి. కుజుడు ఉగ్ర స్వభావం, ధైర్యం, రక్తం వంటి వాటికి కారకుడు. శని న్యాయ దేవుడు. మనం చేసే మంచి పనులకు మంచి ఫలితాలు, చెడు పనులకు చెడు ఫలితాలను అందిస్తాడు. అయితే, కుజుడు-శని ఒకదానికొకటి ఎదురుగా రావడంతో కొన్ని రాశుల వారిపై ప్రతికూల ప్రభావం పడుతుంది.

ఈ సమయంలో మూడు రాశుల వారికి సవాళ్లు ఎదురయ్యే అవకాశం ఉంది. వ్యక్తి గతపరంగా, ఆర్థిక పరంగా సమస్యలు వచ్చే అవకాశం ఉంది. వ్యాపారంలో సమస్యలు రావచ్చు. సెప్టెంబర్ 13 వరకు ఈ కలయిక ఉంటుంది. మరి శని-కుజుల ప్రభావం వలన ఏ రాశుల వారికి సమస్యలు ఎదురవ్వచ్చు? ఎవరు ఎలాంటి ఇబ్బందులు ఎదుర్కొంటారు? అనే విషయాలను ఇప్పుడు తెలుసుకుందాం.

వృశ్చిక రాశి వారు ఈ సమయంలో జాగ్రత్తగా ఉండాలి. వ్యక్తిగత జీవితంలోనే కా...