భారతదేశం, సెప్టెంబర్ 8 -- ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో వాతావరణ పరిస్థితులు సెప్టెంబర్‌లోనూ ఆగస్టు నెలలోని వాతావరణ పరిస్థితులను ప్రతిబింబిస్తున్నట్లు కనిపిస్తున్నాయి. ఈ నెలలో భారీ వర్షాలు కురుస్తాయని ఐఎండీ అంచనా వేస్తోంది. బంగాళాఖాతంలో సెప్టెంబర్ 13న అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉందని ఐఎండీ అంచనా వేసింది. పశ్చిమ వాయవ్య దిశగా కదిలే అవాశం ఉందని, దీనితో ఏపీ, తెలంగాణలో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు పడే అవకాశం ఉంది.

ఆగస్టు నెలలో తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌లలో వర్షాలు, వరదలు సంభవించాయి. ఇప్పటివరకు సెప్టెంబర్‌లో అక్కడక్కడ వర్షాలు కురిశాయి. సోమవారం నుంచి వర్షాలు తిరిగి ప్రారంభమై మరింత తీవ్రమవుతాయని, భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ అంచనా వేసింది. భారీ నుండి అతి భారీ వర్షాలకు పరిస్థితులు అనుకూలంగా ఉన్నాయి.

సెప్టెంబర్ 13న బంగాళాఖాతంలో అల్పపీడనం బలపడి ఆంధ్ర...