భారతదేశం, ఆగస్టు 30 -- మోస్ట్ అవైటెడ్ కన్నడ సినిమాల్లో మూడు సెప్టెంబర్ ఫస్ట్ వీక్ లోనే ఓటీటీలో అడుగుపెట్టే సంకేతాలు కనిపిస్తున్నాయి. ఈ మూడు చిత్రాలు వచ్చే వారం డిజిటల్ స్ట్రీమింగ్ కు వచ్చే అవకాశాలున్నాయి. ఇందులో ఒకటేమో హారర్ థ్రిల్లర్, మరొకటి యాక్షన్ థ్రిల్లర్, ఇంకోటి యాక్షన్ డ్రామా. ఈ మూడు సినిమాలు ఏవి? ఏ ఓటీటీలోకి వస్తున్నాయో చూద్దాం.

కన్నడతో పాటు తెలుగు అభిమానులు కూడా ఎప్పుడెప్పుడు ఓటీటీలోకి వస్తుందా? అని ఎదురు చూస్తున్న చిత్రం 'సు ఫ్రమ్ సో'. ఇదో హారర్ థ్రిల్లర్. చిన్న సినిమాగా థియేటర్లో అడుగుపెట్టిన సు ఫ్రమ్ సో రూ.100 కోట్ల కలెక్షన్లు కొల్లగొట్టింది. మౌత్ టాక్ బాగుండటం, కలెక్షన్లు భారీగా రావడంతో మలయాళం, తెలుగులోనూ డబ్ చేసి రిలీజ్ చేశారు. సినిమాలో ఓ యువకుడిగా ఆడ దెయ్యం పడితే ఎలా ఉంటుందనేది థ్రిల్లింగ్ గా చూపించారు. డైరెక్టెర్ జేపీ తుమ...