Hyderabad, ఆగస్టు 28 -- గ్రహాలు కాలానుగుణంగా ఒక రాశి నుంచి మరో రాశిలోకి ప్రవేశిస్తూ ఉంటాయి. ఈ సమయంలో శుభయోగాలు ఏర్పడతాయి. జ్యోతిష్య శాస్త్రంలో గ్రహాల కలయిక, నక్షత్ర సంచారం, రాశి సంచారం అనేది సహజమే. కొన్ని రాశులకు నెలకు ఒకసారి, ఇంకొన్ని రాశులకు రెండు మూడు నెలలకు ఒకసారి గ్రహాలు రాశిని మార్చుతూ ఉంటాయి.

త్వరలో కర్కాటక రాశిలో శుక్రుడు సంచారం చేయనున్నాడు. దీంతో 12 రాశుల వారిపై ప్రభావం పడుతుంది. సంపద, సంతోషం, శ్రేయస్సుకి కారకుడైన శుక్రుడు సెప్టెంబర్ నెలలో కర్కాటక రాశిలోకి ప్రవేశిస్తాడు. ఇది నాలుగు రాశుల వారికి శుభ ఫలితాలను అందిస్తుంది. ఈ రాశుల వారికి పట్టిందల్లా బంగారమే. మరి రాశుల్లో మీ రాశి కూడా ఉందేమో చూసుకోండి.

వృషభ రాశి వారికి సెప్టెంబర్ నెల అద్భుతంగా ఉంటుంది. శుక్రుడు రాశి మార్పు చెందడంతో ఏ పని చేసినా కూడా ఈ రాశి వారికి కలిసొస్తుంది. విద్...