భారతదేశం, జనవరి 10 -- బాలీవుడ్ వెర్సటైల్ డైరెక్టర్ విశాల్ భరద్వాజ్, స్టార్ హీరో షాహిద్ కపూర్ కాంబినేషన్ అంటేనే బాక్సాఫీస్ వద్ద ఒక సెన్సేషన్. 'కమీనే', 'హైదర్' వంటి క్లాసిక్ సినిమాల తర్వాత విశాల్ భరద్వాజ్, షాహిద్ కపూర్ వంటి సెన్సేషనల్ కాంబోలో వస్తున్న తాజా చిత్రం 'ఓ రోమియో' (O' Romeo).

తాజాగా శనివారం (జనవరి 10) నాడు ఓ రోమియో టీజర్‌ను రిలీజ్ చేశారు. ఇప్పుడు ఓ రోమియో టీజర్ గ్లింప్స్ సోషల్ మీడియాను ఊపేస్తోంది. 1 నిమిషం 35 సెకన్ల నిడివి ఉన్న ఈ టీజర్‌లో సినిమాలోని విభిన్నమైన పాత్రలను పరిచయం చేస్తూ దర్శకుడు మ్యాజిక్ క్రియేట్ చేశారు.

ఓ రోమియో గ్లింప్స్‌లో షాహిద్ కపూర్ నెవర్ బిఫోర్ లుక్‌లో కనిపిస్తున్నారు. కౌబాయ్ హ్యాట్, బ్లాక్ వెస్ట్, ఒంటి నిండా టాటూలు, మెడలో భారీ ఆభరణాలతో పక్కా రగ్గడ్ అండ్ వయలెంట్ అవతారంలో షాహిద్ ఆకట్టుకుంటున్నారు. అయితే, ఈ టీజ...