భారతదేశం, ఫిబ్రవరి 24 -- మంగళవారం (ఫిబ్రవరి 24) ట్రేడింగ్ ప్రారంభమైన కొద్దిసేపటికే దలాల్ స్ట్రీట్‌లో అమ్మకాల సునామీ కనిపించింది. అంతర్జాతీయంగా నెలకొన్న ప్రతికూల పరిస్థితులతో ఇన్వెస్టర్లు ఒక్కసారిగా ప్రాఫిట్ బుకింగ్‌కు మొగ్గు చూపారు. ఫలితంగా సెన్సెక్స్ 800 పాయింట్లకు పైగా పతనమై 82,451 కనిష్ట స్థాయిని తాకగా, నిఫ్టీ 25,500 దిగువకు పడిపోయింది. మార్కెట్ ప్రారంభమైన కేవలం అరగంటలోనే ఇన్వెస్టర్లు ఏకంగా Rs.4 లక్షల కోట్ల మేర సంపదను కోల్పోయారు.

మార్కెట్ల పతనానికి 5 ప్రధాన కారణాలు:

అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ టారిఫ్ వ్యూహాలు మార్కెట్లలో భయాందోళనలు కలిగిస్తున్నాయి. గత వారమే ట్రంప్ టారిఫ్ నిర్ణయాలను అక్కడి సుప్రీంకోర్టు కొట్టివేసినప్పటికీ, ప్రభుత్వం మాత్రం వెనక్కి తగ్గడం లేదు. 1962 నాటి ట్రేడ్ ఎక్స్‌పాన్షన్ యాక్ట్‌లోని సెక్షన్ 232ను ఉపయోగించి గ...