భారతదేశం, సెప్టెంబర్ 1 -- గత మూడు ట్రేడింగ్ సెషన్స్‌లో నష్టాలను చవిచూసిన భారతీయ స్టాక్ మార్కెట్లు, సోమవారం సెప్టెంబర్ 1, 2025న మళ్లీ పుంజుకున్నాయి. అన్ని రంగాల నుంచి కొనుగోళ్ల మద్దతు లభించడంతో ప్రధాన సూచీలు లాభాలతో ముగిశాయి. సెన్సెక్స్ 555 పాయింట్ల (0.70%) లాభంతో 80,364.49 వద్ద, అలాగే నిఫ్టీ 198 పాయింట్ల (0.81%) లాభంతో 24,625.05 వద్ద ముగిశాయి. ఈ ఒక్కరోజే ఇన్వెస్టర్ల సంపద ఏకంగా Rs.5 లక్షల కోట్లకు పైగా పెరగడం విశేషం.

మార్కెట్ రికవరీలీ 8 కీలక అంశాలు:

తాజాగా వెలువడిన భారత తొలి త్రైమాసిక జీడీపీ గణాంకాలు అంచనాలను మించిపోయాయి. దీంతో మార్కెట్‌లో సానుకూల వాతావరణం నెలకొంది. అలాగే, రాబోయే జీఎస్‌టీ కౌన్సిల్ సమావేశంలో రేట్లు తగ్గే అవకాశం ఉందనే అంచనాలు కూడా మార్కెట్‌కు బలాన్నిచ్చాయి. "భారత తొలి త్రైమాసిక జీడీపీ 7.8% వృద్ధి నమోదు చేయడం ఇన్వెస్టర్ల విశ...