భారతదేశం, నవంబర్ 15 -- గాడ్ ఆఫ్ ది మాసెస్ నందమూరి బాలకృష్ణ, బ్లాక్ బస్టర్ దర్శకుడు బోయపాటి శ్రీను పవర్‌ఫుల్ కొలాబరేషన్‌లో వస్తున్న మోస్ట్ అవేయిటెడ్ డివైన్ యాక్షన్ థ్రిల్లర్ మూవీ 'అఖండ 2: తాండవం'. రామ్ ఆచంట, గోపీచంద్ ఆచంట ప్రతిష్టాత్మకంగా ఈ సినిమాను నిర్మిస్తున్నారు.

బాలకృష్ణ కుమార్తె ఎం తేజస్విని నందమూరి సగర్వంగా చిత్రాన్ని సమర్పిస్తున్నారు. ఎస్ థమన్ సంగీతం అందించారు. ఫస్ట్ సింగిల్-ది తాండవం ప్రోమోకు అద్భుతమైన స్పందన వచ్చింది. తాజాగా నిన్న (నవంబర్ 14) ముంబైలోని జుహూలోని పీవీఆర్ మాల్‌లో అఖండ 2 ది తాండవం సాంగ్‌ను రిలీజ్ చేశారు. ఈ సందర్బంగా నిర్వహించి సాంగ్ లాంచ్ ఈవెంట్‌లో హీరో బాలకృష్ణ ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశారు.

గాడ్ ఆఫ్ మాసెస్ నందమూరి బాలకృష్ణ మాట్లాడుతూ.. "మీడియా మిత్రులకు, నా అభిమానులకు ఈ ఈవెంట్‌కి వచ్చిన అందరికీ ధన్యవాదాలు. నాకు ...