భారతదేశం, డిసెంబర్ 3 -- రాయ్‌పూర్‌లో జరిగిన భారత్, దక్షిణాఫ్రికా రెండో వన్డే మ్యాచ్ భారత అభిమానులకు చిరకాలం గుర్తుండిపోతుంది. విరాట్ కోహ్లీ, రుతురాజ్ గైక్వాడ్ కలిసి క్రీజులో పరుగుల వరద పారించారు. ఇద్దరూ సెంచరీల మోత మోగించారు. ఒక్కో ఓవర్ గడుస్తున్న కొద్దీ దక్షిణాఫ్రికా బౌలర్లపై ఆధిపత్యం చెలాయిస్తూ, వీరిద్దరూ నెలకొల్పిన భాగస్వామ్యం మ్యాచ్‌ను భారత్ వైపు తిప్పింది.

విరాట్ కోహ్లీ వరుసగా రెండో సెంచరీ బాదాడు. వన్డేల్లో ఈ మధ్యే సచిన్ టెండూల్కర్ అత్యధిక సెంచరీల రికార్డును బ్రేక్ చేసిన అతడు.. వెంటనే మరో మూడంకెల స్కోరు అందుకున్నాడు. అతడు తనదైన క్లాసిక్ శైలిలో ఇన్నింగ్స్‌ను నిర్మించాడు. ఎలాంటి రిస్క్ తీసుకోకుండానే, గ్యాప్స్ వెతుక్కుంటూ స్కోరు బోర్డును పరిగెత్తించాడు. ముఖ్యంగా వికెట్ల మధ్య చిరుతలా పరిగెడుతూ సింగిల్స్‌ను డబుల్స్‌గా మలిచి బౌలర్లపై ఒత్త...