భారతదేశం, ఏప్రిల్ 30 -- తమిళ స్టార్ హీరో సూర్య నటించిన రెట్రో చిత్రం రేపు (మే 1) విడుదల కానుంది. కార్తీక్ సుబ్బరాజ్ దర్శకత్వం వహించిన ఈ యాక్షన్ మూవీకి ఫుల్ క్రేజ్ ఉంది. తమిళనాడులో తొలి రోజు అదరగొట్టే ఛాన్స్ ఉంది. అయితే, రెట్రోకు పోటీగా తమిళంలో ఓ తక్కువ బడ్జెట్ వస్తోంది. అదే 'టూరిస్ట్ ఫ్యామిలీ'. ఈ చిత్రం కూడా మే 1న విడుదలవుతోంది. రెట్రో లాంటి భారీ సినిమాకు పోటీగా దిగుతోంది. ఈ సినిమాలో సీనియర్ నటి సిమ్రన్, శశికుమార్ లీడ్ రోల్స్ చేశారు.

రెట్రోతో తమ టూరిస్ట్ ఫ్యామిలీని ఎందుకు పోటీకి దింపాల్సి వస్తుందో కారణం చెప్పారు నిర్మాత యువరాజ్ గణేశన్. ఈ సినిమా కోసం నిర్వహించిన ప్రెస్‍మీట్‍లో ఈ విషయం గురించి మాట్లాడారు.

ఓటీటీ డీల్ వల్లే తాము థియేటర్లలో రెట్రోతో పోటీ పడాల్సి వస్తుందని నిర్మాత యువరాజ్ తెలిపారు. ఓటీటీతో ఒప్పందం కారణంగా విడుదల తేదీని మార్చా...