భారతదేశం, డిసెంబర్ 8 -- సూర్యనారాయణ మూర్తిని ఆరాధించడం వలన సకల సంతోషాలు కలుగుతాయి. సూర్యుడిని గ్రహాలకు రాజు అని చెప్తారు. అత్యంత శక్తి, విశ్వాసానికి సంకేతం. సూర్యుడు జీవితంలో ప్రతి అంశాన్ని ప్రభావితం చేస్తాడు. సూర్యోదయం సరైన పద్ధతిలో ఆరాధిస్తే సకల శుభాలు కలుగుతాయి. వ్యాపారంతో పాటుగా అనేక రంగాల్లో అద్భుతమైన లాభాలను చూడొచ్చు. కోరికలు కూడా నెరవేరుతాయి.

సూర్యుడు స్థానం జాతకంలో బలంగా ఉన్నట్లయితే అనేక సమస్యలకు దూరంగా ఉండొచ్చు. అదే బలహీనంగా ఉంటే అనేక సమస్యలను ఎదుర్కోవాల్సి ఉంటుంది. సూర్య దేవుని అనుగ్రహాన్ని పొందడం కోసం, ఈ సూర్య శక్తివంతమైన మంత్రాలను పఠిస్తే మంచిది.

చాలా రకాల అనారోగ్య సమస్యల నుంచి కూడా బయటపడవచ్చు. అలాగే తెలివితేటలు పెరుగుతాయి. బుద్ధి వికాసం, శరీర బలం కూడా పెంచుకోవచ్చు. అలాగే ఏదో మానసిక శక్తుల్ని కూడా పెంచుకోవచ్చు. ఆర్థిక ఇబ్బంద...