భారతదేశం, డిసెంబర్ 23 -- గ్రహాలు ఎప్పటికప్పుడు తమ రాశులను మారుస్తూ ఉంటాయి. గ్రహాల సంచారంలో మార్పు వస్తుంది. ఇది అన్ని రాశుల వారి జీవితాల్లో అనేక మార్పులను తీసుకు వస్తుంది. వేద జ్యోతిష్య శాస్త్రంలో యోగాలు గ్రహాల సంయోగం జరిగినప్పుడు ఏర్పడుతూ ఉంటాయి. జ్యోతిష్య లెక్కల ప్రకారం జనవరి 13న సూర్య, చంద్రుల కలయిక ఉంటుంది. ఇది వ్యతిపాత యోగాన్ని ఏర్పరుస్తుంది. ఈ యోగం శుభప్రదమైనది. అన్ని రాశుల వారి జీవితాల్లో అనేక మార్పులు తీసుకొస్తుంది. కానీ కొన్ని రాశుల వారు మాత్రం ఈ సమయంలో ఎక్కువ లాభాలను పొందుతారు.

వ్యతిపాత యోగం అనేది జ్యోతిష్య శాస్త్రంలో శుభప్రదమైన యోగంగా భావిస్తారు. సూర్య-చంద్రుల కలయికతో ఈ యోగం ఏర్పడుతుంది. ఇది జనవరి 13, అంటే సంక్రాంతికి ముందు ఏర్పడుతుంది. 2026 మొదటి నెలలో ఈ యోగం ఏర్పడి కొన్ని రాశుల వారి జీవితాల్లో అద్భుతమైన మార్పులను తీసుకొస్తుం...