భారతదేశం, ఫిబ్రవరి 12 -- సూర్య గ్రహణం నాడు చంద్రుడు తన రాశి, నక్షత్రాన్ని రెండూ కూడా మార్చబోతున్నాడు. ఇది కొన్ని రాశుల వారి జీవితంలో సమస్యలను తీసుకొచ్చే అవకాశం ఉంది. గ్రహాలు ఎప్పటికప్పుడు వాటి రాశులను మారుస్తూ ఉంటాయి. గ్రహాల సంచారంలో మార్పు వచ్చినప్పుడు అది అన్ని రాశుల వారి జీవితంలో కూడా ప్రభావాన్ని చూపిస్తుంది. ఒక్కోసారి శుభ ఫలితాలను తీసుకొస్తే, ఒక్కోసారి అశుభ ఫలితాలను కలిగిస్తుంది.

ఈ ఏడాది వచ్చే మొదటి సూర్య గ్రహణం ఫిబ్రవరి 17న రాబోతోంది. మధ్యాహ్నం 3:26కి ప్రారంభమై, రాత్రి 7:57తో ముగుస్తుంది. ద్రిక్ పంచాంగం ప్రకారం, ఆ రోజు రాత్రి 9:15కి చంద్రుడు కుంభ రాశిలోకి ప్రవేశించబోతున్నాడు. ఈ రాశికి అధిపతి శని. అలాగే 9:15కి శతభిష నక్షత్రంలోకి అడుగు పెడతాడు. దీంతో కొన్ని రాశుల వారి పై ప్రతికూల ప్రభావం పడుతుంది. సూర్యగ్రహణం నాడు చంద్రుని సంచారంలో రె...