Hyderabad, జూన్ 16 -- వేద జ్యోతిష్య శాస్త్రం ప్రకారం, బ్రహ్మ ఆదిత్య యోగం జూన్ 15 అంటే నిన్నటి నుంచి మొదలైంది. ఈ కారణంగా మూడు రాశుల వారికి శుభవార్తలు అందుతాయి. గ్రహాలు కాలానుగుణంగా ఒక రాశి నుంచి మరో రాశిలోకి ప్రవేశిస్తూ ఉంటాయి. జ్యోతిష్య శాస్త్రంలో గ్రహాల మార్పుకు ఎంతో ప్రాముఖ్యత ఉంది. ఎందుకంటే అవి మన జీవితంలో అనేక అంశాలను ప్రభావితం చేస్తాయి.

ఈ సంవత్సరం జూన్ 15న సూర్యుడు వృషభ రాశి నుంచి మిథున రాశిలోకి ప్రవేశిస్తాడు. పైగా బుధుడు, గురువు కూడా ఇప్పటికే అదే రాశిలో ఉన్నారు. మూడు ముఖ్యమైన గ్రహాల కదలిక ఒక ప్రత్యేక యాదృచ్ఛికతను సృష్టిస్తోంది. అదే బ్రహ్మ ఆదిత్య యోగం.

ఈ బ్రహ్మ ఆదిత్య యోగం వలన కొన్ని రాశుల వారికి కలిసి వస్తుంది. మరి ఏయే రాశుల వారికి ఎలాంటి ఫలితం ఉంటుంది? ఎవరు ఎలాంటి లాభాలను పొందుతారు? వంటి విషయాలను ఇప్పుడే తెలుసుకుందాం. జ్యోతిష్య శ...