భారతదేశం, ఫిబ్రవరి 7 -- సూర్యుడికి పువ్వులు అంటే ఎంతో ప్రీతి. వీటిని సూర్యుడికి సమర్పిస్తే కోరిన కోరికలు నెరవేరుతాయి. సూర్య నారాయణ మూర్తి ప్రత్యేక అనుగ్రహం కూడా కలుగుతుంది. సూర్యుడికి అవిసె పూలు, మోదుగ పూలు, మొగలి పూలు, బృంగరాజ, శమీ అంటే ఎంతో ఇష్టం. అలాగే విష్ణు తులసి, కృష్ణ తులసి, రక్త చందనం అంటే సూర్యుడికి చాలా ఇష్టం. ఇదే విషయం భవిష్య పురాణం చెబుతోంది.

సూర్యునికి అర్ఘ్య ప్రధానం చేయడం వలన సూర్యుని అనుగ్రహం కలుగుతుంది. సూర్యుని ప్రసన్నతతో ఆయురారోగ్యాలు, ధన, ధాన్యాలు, క్షేత్రం, పుత్రులు, కలత్రం, మిత్రులు, తేజస్సు, యశస్సు, కాంతి, విద్య, సౌభాగ్యం, వైభవాలు కలుగుతాయి.

చాలా మంది స్త్రీలకు ఉండే సందేహం ఇది. స్త్రీలు సూర్య నమస్కారం చేయవచ్చా, చేయకూడదా అనే విషయంలో ఎలాంటి అభ్యంతరం లేదు. స్త్రీలు సూర్య నమస్కారాలు చేయవచ్చు. సూర్య నమస్కారాలకు స్త్రీలు...