భారతదేశం, డిసెంబర్ 9 -- గ్రహాలు ఎప్పటికప్పుడు వాటి రాశులను మారుస్తూ ఉంటాయి. గ్రహాల సంచారంలో మార్పు జరిగినప్పుడు అది ద్వాదశ రాశుల వారి జీవితంలో చాలా మార్పులను తీసుకు వస్తుంది. కొన్ని సార్లు శుభ ఫలితాలు ఎదురైతే, కొన్ని సార్లు గ్రహాల సంచారం కారణంగా ప్రతికూల ఫలితాలను కూడా ఎదుర్కోవాల్సి ఉంటుంది. 2025 త్వరలోనే పూర్తి కాబోతోంది. 2026 రాబోతోంది.

కొత్త ఏడాది గ్రహాల స్థానాల్లో మార్పు రాబోతోంది. జనవరి 4న సూర్యుడు శని 72 డిగ్రీల కోణంలో సంయోగం చెందుతాయి. దీంతో పంచాంగ యోగం ఏర్పడుతుంది. ఈ యోగం కారణంగా కొన్ని రాశుల వారి జీవితమే మారిపోతుంది. కొన్ని రాశుల వారు విపరీతమైన అదృష్టాన్ని పొందుతారు. మరి అదృష్ట రాశులు ఎవరు? ఈ రాశుల్లో మీరు ఒకరేమో చూసుకోండి.

కర్కాటక రాశి వారికి పంచాంగ యోగం బాగా కలిసి వస్తుంది. భావోద్వేగ సమతుల్యతను అందిస్తుంది. కుటుంబంలో ఉన్న సమస్...