భారతదేశం, జనవరి 1 -- గ్రహాలు ఎప్పటికప్పుడు వాటి రాశులను మారుస్తూ ఉంటాయి. గ్రహాల సంచారంలో మార్పు జరిగినప్పుడు, అది అన్ని రాశుల వారి జీవితంలో అనేక మార్పులను తీసుకువస్తుంది. కొత్త సంవత్సరంలో కూడా కొన్ని ప్రధాన గ్రహాల సంచారంలో మార్పు ఉంది. మార్చి 2026లో వ్యతిపాత యోగం ఏర్పడనుంది. ఇది సూర్య, చంద్రుల కలయికతో ఏర్పడనుంది. జ్యోతిష్యం ప్రకారం చూసినట్లయితే, వ్యతిపాత యోగం అనేది చాలా ముఖ్యమైనది. కొన్ని సార్లు ఇది అశుభ ఫలితాలను తీసుకొస్తుంది.

పంచాంగం ప్రకారం చూసినట్లయితే, మార్చి 5న మధ్యాహ్నం 3:00 గంటలకు సూర్యుడు, చంద్రుడు సంయోగం చెంది ఈ వ్యతిపాత యోగాన్ని ఏర్పరుస్తున్నారు. ఈ యోగం మార్చి 5 వరకు ఉంటుంది. అయితే ఈ సమయంలో కొన్ని రాశుల వారికి ఇది ఛాలెంజ్‌గా మారబోతుంది. మరి ఏ రాశుల వారికి ఈ వ్యతిపాత యోగం కాస్త సమస్యలను తీసుకురాబోతోంది? ఏ రాశులు వారు జాగ్రత్తగా...