భారతదేశం, డిసెంబర్ 19 -- గ్రహాలు ఎప్పటికప్పుడు వాటి రాశులను మారుస్తూ ఉంటాయి. గ్రహాల సంచారంలో మార్పు వచ్చినప్పుడు అది అన్ని రాశుల మీద ప్రభావం చూపిస్తుంది. మార్గశిర అమావాస్య ఈ ఏడాదిలో చివరి అమావాస్య. అయితే ఈరోజు కొన్ని యాదృచ్ఛికాలు చోటు చేసుకోవడం జరిగింది. అమావాస్య నాడు పితృ దేవతలను స్మరించి, వారి పేరు చెప్పి దాన ధర్మాలు చేయడం, తర్పణాలు వదలడం, శ్రార్ధ కర్మలు చేయడం వంటి వాటిని పాటిస్తూ ఉంటారు. ఇటువంటివి ఆచరించడం వలన పూర్వీకుల అనుగ్రహం కలిగి ఆనందంగా ఉండొచ్చు. వారి ఆశీస్సులను పొందడానికి కూడా వీలవుతుంది.

పంచాంగం ప్రకారం మార్గశిర అమావాస్య డిసెంబర్ 19 ఉదయం 5:00 కి మొదలై డిసెంబర్ 20 ఉదయం 7:12తో ముగుస్తుంది. ఉదయ తిథి ప్రకారం డిసెంబర్ 19 శుక్రవారం, అంటే ఈరోజు అమావాస్య వచ్చింది. ఉదయం 7:09 నుంచి ఉదయం 11:00 వరకు స్నానాలు చేయడానికి శుభ సమయం. తర్పణాలు, ...