భారతదేశం, జనవరి 2 -- ఇకపై సూరత్ నుంచి చెన్నైకి రోడ్డు మార్గంలో వెళ్లడం మరింత సులభం కానుంది. గంటల కొద్దీ సాగే సుదీర్ఘ ప్రయాణ భారానికి చెక్ పెడుతూ కేంద్ర ప్రభుత్వం ఒక భారీ ప్రాజెక్టుకు శ్రీకారం చుట్టింది. నేషనల్ హైవే ఇన్వెస్ట్‌మెంట్ ప్లాన్‌లో భాగంగా Rs.19,142 కోట్ల వ్యయంతో నిర్మించనున్న కొత్త కారిడార్‌కు కేంద్ర క్యాబినెట్ ఆమోదం తెలిపింది. దీనివల్ల ప్రస్తుతం పడుతున్న 31 గంటల ప్రయాణ సమయం ఏకంగా 14 గంటలు తగ్గి, కేవలం 17 గంటల్లోనే గమ్యస్థానానికి చేరుకోవచ్చు.

మహారాష్ట్రలో నిర్మించే 374 కిలోమీటర్ల పొడవైన 'గ్రీన్‌ఫీల్డ్ నాశిక్-సోలాపూర్-అక్కల్‌కోట్' హైవే నిర్మాణానికి డిసెంబర్ 31, 2025న జరిగిన క్యాబినెట్ సమావేశంలో పచ్చజెండా ఊపారు. ఇది సూరత్-చెన్నై హైస్పీడ్ కారిడార్‌లో కీలక భాగంగా ఉంటుంది.

దేశంలోని హైస్పీడ్ జాతీయ రహదారుల మౌలిక సదుపాయాల్లో ఇదొక మైలుర...