Hyderabad, ఆగస్టు 5 -- సూపర్ హిట్ హారర్ థ్రిల్లర్ ఫ్రాంఛైజీ నుంచి వచ్చిన మరో బ్లాక్‌బస్టర్ హారర్ థ్రిల్లర్ మూవీ 28 ఇయర్స్ లేటర్ (28 Years Later). ఈ సినిమా జూన్ లో రిలీజ్ కాగా.. ఇప్పుడు ఒకేసారి ఏకంగా మూడు ఓటీటీ ప్లాట్‌ఫామ్స్ లో స్ట్రీమింగ్ కు వచ్చింది. అయితే ఈ మూడింట్లోనూ ఫ్రీగా కాకుండా రెంట్ విధానంలోనే అందుబాటులో ఉండటం ఓ ట్విస్ట్.

ప్రముఖ హాలీవుడ్ డైరెక్టర్ డానీ బోయల్ డైరెక్ట్ చేసిన మూవీ 28 ఇయర్స్ లేటర్. గతంలో వచ్చిన 28 డేస్ లేటర్, 28 వీక్స్ లేటర్ సినిమాలకు ఇది సీక్వెల్. తాజాగా వచ్చిన 28 ఇయర్స్ లేటర్ జూన్ 20న థియేటర్లలో రిలీజ్ కాగా.. ఇప్పుడు అమెజాన్ ప్రైమ్ వీడియో, ఆపిల్ టీవీ ప్లస్, బుక్‌మైషో స్ట్రీమ్ లలో అందుబాటులోకి వచ్చింది.

అయితే ఈ సినిమా చూడటానికి రూ.249 రెంట్ చెల్లించాల్సిందే. ఈ సినిమాలో చాలా వరకు షూటింగ్ ను ఐఫోన్ 15 ప్రో మ్యాక్స్ త...