Hyderabad, జూన్ 8 -- టాలీవుడ్ స్టార్ హీరోయిన్ సమంత తొలిసారి ప్రొడ్యూసర్ గా మారి నిర్మించిన మూవీ శుభం (Subham). ఈ సినిమా గత నెలలో థియేటర్లలో రిలీజై సంచలన విజయం సాధించింది. మొత్తానికి ఇప్పుడు వచ్చే వారమే ఓటీటీలో రిలీజ్ కాబోతోంది. ఈ విషయాన్ని కొన్ని రోజుల కిందటే వెల్లడించిన జియోహాట్‌స్టార్ ఓటీటీ తాజాగా ఆదివారం (జూన్ 8) ట్రైలర్ రిలీజ్ చేసింది.

సమంత ప్రొడ్యూస్ చేసిన తెలుగు హారర్ కామెడీ మూవీ శుభం. ఏళ్లకు ఏళ్లుగా సాగే టీవీ సీరియల్స్ చూస్తూ దెయ్యాలుగా మారే భార్యల చుట్టూ సాగే ఫన్నీ మూవీ ఇది. ఈ సినిమా వచ్చే శుక్రవారం (జూన్ 13) నుంచి జియోహాట్‌స్టార్ ఓటీటీలో స్ట్రీమింగ్ కానుంది.

ఇదే విషయాన్ని మరోసారి చెబుతూ ఆ ఓటీటీ ఓ ట్రైలర్ రిలీజ్ చేసింది. "మీరు నవ్వుతారు. మీరు భయపడతారు. మళ్లీ మళ్లీ అదే చేస్తారు. మీరు ఇప్పటి వరకూ చూడని హారర్ కామెడీ. జియోహాట్‌స్టార...