భారతదేశం, జూలై 20 -- యాక్టింగ్ లో అదరగొట్టి తన సినిమాలతో రికార్డులు కొల్లగొట్టే సూపర్ స్టార్ మహేష్ బాబు.. ఖాళీ దొరికినప్పుడు వేరే సినిమాలపై ప్రశంసలు కురిపిస్తాడు. స్టోరీ నచ్చితే మూవీ అద్భుతమంటాడు. తాజాగా మహేష్ బాబుకు బాలీవుడ్ లేటెస్ట్ మూవీ 'సయారా' నచ్చింది. ఈ సినిమా అమేజింగ్ అంటూ ఆకాశానికి ఎత్తేశాడు. ఈ సినిమా ఏ ఓటీటీలోకి వస్తుందో చూద్దాం.

బాలీవుడ్ సయారా మూవీపై మహేష్ బాబు ప్రశంసలు కురిపించాడు. ''సయారా టీమ్ టేక్ ఏ బో. నిజాయతీగా స్టోరీని చెప్పే అందమైన సినిమా. అద్భుతమైన ప్రదర్శన. అత్యున్నతంగా తెరకెక్కించారు. తమ పాత్రలను గొప్పగా చేసిన అహాన్ పాండే, అనీత్ పడ్డాకు బిగ్ లవ్. ఈ సినిమా ప్రేమకు అర్హమైందే'' అని మహేష్ బాబు ఎక్స్ లో పోస్టు చేశాడు.

సయారా మూవీ జులై 18న రిలీజైంది. ఈ మూవీకి అన్ని వైపుల నుంచి పాజిటివ్ రెస్పాన్స్ వస్తోంది. కలెక్షన్లు కూడా క...