భారతదేశం, డిసెంబర్ 8 -- గ్లామ‌ర్ పాత్ర‌లతో హీరోయిన్‌గా కెరీర్ స్టార్ట్ చేసిన వరలక్ష్మి శరత్ కుమార్.. లేడీ విలన్ పాత్రలకు కేరాఫ్ అడ్రస్‌గానూ పేరు తెచ్చుకుంది. ఇక ఇప్పుడు ఆడియ‌న్స్‌ను థ్రిల్‌కు గురి చేసే క్యారెక్ట‌ర్‌తో రాబోతోంది. వరలక్ష్మి శరత్ కుమార్, నవీన్ చంద్ర ప్ర‌ధాన పాత్ర‌ల్లో నటించిన హారర్ థ్రిల్లర్ సినిమా 'పోలీస్ కంప్లెయింట్'.

డైరెక్టర్ సంజీవ్ మేగోటి దర్శకత్వం వహించిన పోలీస్ కంప్లెయింట్ మూవీ ఇటీవల షూటింగ్ పూర్తిచేసుకుంది. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనులు జరుపుకుంటోంది. ఈ సినిమాలో వరలక్ష్మి ప‌వ‌ర్‌ఫుల్ పాత్రలో కనిపించ‌నుందని, తొలిసారి పూర్తిగా వినోదాత్మకమైన రోల్‌లో నటించడం ప్రత్యేక ఆకర్షణ అని నిర్మాతలు తెలిపారు.

అలాగే, సూపర్ స్టార్ కృష్ణపై చిత్రీకరించిన స్పెషల్ సాంగ్ సినిమాకే హైలెట్‌గా నిలుస్తుందని మేకర్స్ వెల్లడించారు. ఎమ్ఎస్‌కే...