భారతదేశం, సెప్టెంబర్ 13 -- కార్తీక్ ఘట్టమనేని దర్శకత్వంలో తేజ సజ్జా, మంచు మనోజ్, రితికా నాయక్, శ్రియా శరణ్ తదితరులు నటించిన 'మిరాయ్' (Mirai) బాక్సాఫీస్ ను షేక్ చేస్తోంది. సెప్టెంబర్ 12న ఈ సినిమా థియేటర్లలో రిలీజైంది. ఈ మూవీకి అన్ని వైపుల నుంచి పాజిటివ్ టాక్ వస్తోంది. కథ అదిరిపోయిందని, విజువల్ ఎఫెక్ట్స్ వేరే లెవల్ అనే టాక్ వస్తోంది. ఇక తేజ సజ్జా, మంచు మనోజ్ యాక్టింగ్ మూవీని మరో స్థాయికి తీసుకెళ్లిందని అంటున్నారు. మరి ఈ సినిమా తొలి రోజు ప్రపంచవ్యాప్తంగా ఎన్ని కోట్లు రాబట్టిందో చూద్దాం.

ఫ్యాంటసీ యాక్షన్ అడ్వెంచరస్ థ్రిల్లర్ మిరాయ్ శుక్రవారం థియేటర్లలో విడుదలైంది. తేజ మునుపటి చిత్రం హనుమన్, అలాగే మంచు విష్ణు నటించిన కన్నప్ప తొలి రోజు వసూళ్లను మిరాయ్ దాటేసింది. తేజ సజ్జా కెరీర్ లోనే బెస్ట్ ఓపెనింగ్స్ సాధించిన మూవీగా నిలిచింది. ఈ చిత్రం శుక్రవ...