Hyderabad, సెప్టెంబర్ 22 -- దృశ్యం 3 షూటింగ్ మొదలైంది. ఇప్పటికే ఈ ఫ్రాంఛైజీ నుంచి వచ్చిన రెండు సినిమాలు బ్లాక్‌బస్టర్ కావడంతో ఈ మూడో సినిమాపై భారీ అంచనాలు ఉన్నాయి. డైరెక్టర్ జీతు జోసెఫ్ డైరెక్షన్ లో తెరకెక్కుతున్న సినిమా ఇది. సోమవారం (సెప్టెంబర్ 22) కొచ్చిలోని ఎస్.ఎన్. లా కాలేజ్ పూతోట్టలో షూటింగ్ మొదలైంది. ఇటీవల దాదాసాహెబ్ ఫాల్కే అవార్డు గెలుచుకున్న మోహన్‌లాల్ మరోసారి జార్జ్ కుట్టి పాత్రలో తిరిగి వస్తున్నాడు.

దృశ్యం 3 సినిమా షూటింగ్ పూజా కార్యక్రమంతో మొదలైంది. సాంప్రదాయ పద్ధతిలో దీపం వెలిగించి ప్రారంభించారు. ఈ ఈవెంట్‌లో మోహన్‌లాల్‌తో పాటు డైరెక్టర్ జీతు జోసెఫ్, ప్రొడ్యూసర్ ఆంటోనీ పెరుంబవూర్ కూడా పాల్గొన్నారు. మోహన్‌లాల్ తన ఎక్స్ అకౌంట్ లో కొన్ని ఫొటోలు షేర్ చేశాడు.

"జార్జ్‌కుట్టి ప్రపంచాన్ని మళ్ళీ సజీవం చేస్తున్నాను.. ఈ రోజు పూజతో దృశ్య...