Hyderabad, ఆగస్టు 1 -- ఓటీటీలోకి ఈరోజు అంటే శుక్రవారం (ఆగస్ట్ 1) ఓ లేటెస్ట్ తెలుగు కామెడీ డ్రామా స్ట్రీమింగ్ కు వచ్చింది. ఈ మూవీ పేరు ఓ భామ అయ్యో రామ. సుహాస్ లీడ్ రోల్లో నటించిన మూవీ ఇది. ఓ అమ్మాయి ప్రేమలో పడి తిరిగి సినిమా మేకింగ్ పై దృష్టి సారించే అబ్బాయి చుట్టూ తిరిగే ఈ సినిమాకు మిక్స్‌డ్ రివ్యూలు వచ్చాయి.

టాలీవుడ్ యువ నటుడు సుహాస్ నటించిన లేటెస్ట్ మూవీ ఓ భామ అయ్యో రామ. ఈ సినిమా కేవలం 20 రోజుల్లోనే ఓటీటీలోకి అడుగుపెట్టింది. శుక్రవారం (ఆగస్ట్ 1) నుంచి ఈటీవీ విన్ ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతోంది. ఈ విషయాన్ని ఒక రోజు ముందే ఆ ఓటీటీ అనౌన్స్ చేసింది.

"అతడు కోల్పోయిన కలలను ఆమె తిరిగి తీసుకొచ్చింది.. అంతేకాదు అతని లోతైన గాయాలను కూడా.. ఓ భామ అయ్యో రామ ఆగస్ట్ 1న ప్రీమియర్ కానుంది. ఈటీవీ విన్ లో.." అనే క్యాప్షన్ తో ట్వీట్ చేసింది. ఇప్పటికే ఈ సినిమా...