భారతదేశం, ఆగస్టు 27 -- పవన్ కల్యాణ్ అప్ కమింగ్ మూవీ 'ఓజీ' హైప్ ను మరింత పెంచేలా, ఫ్యాన్స్ కు వినాయక చవితి గిఫ్ట్ గా కొత్త సాంగ్ వచ్చేసింది. ఓజీ మూవీ నుంచి రొమాంటిక్ లవ్ మెలోడీ ఇవాళ (ఆగస్టు 27) రిలీజైంది. 'సువ్వి సువ్వి సువ్వాలా' అంటూ సాగే ఈ మెలోడీ మనసుకు హత్తుకునేలా ఉంది. వినాయక చవితి సందర్భంగా ఓజీ నుంచి రెండో పాటను బుధవారం రిలీజ్ చేశారు మేకర్స్.

పవన్ కల్యాణ్ మూవీ 'ఓజీ'పై ఇప్పటికే భారీ అంచనాలు నెలకొన్నాయి. ఇక ఇప్పటికే పగ రగిలిన ఫైరూ అంటూ ఈ మూవీ నుంచి రిలీజైన ఫైర్ స్టోర్మ్ ఫస్ట్ లిరికల్ సాంగ్ యూట్యూబ్ ను షేక్ చేస్తూనే ఉంది. ఇప్పుడు ఆ హైప్ ను మరో లెవల్ కు తీసుకెళ్లేందుకు రొమాంటిక్ లవ్ మెలోడీ 'సువ్వి సువ్వి సువ్వాలా'ను వదిలారు ఓజీ మేకర్స్. ఈ లిరికల్ వీడియోలో పవన్ కల్యాణ్ వింటేజీ లుక్ లో కనిపించారు. పవన్, ప్రియాంక మోహన్ కెమిస్ట్రీ అదిరిపోయిం...