భారతదేశం, ఫిబ్రవరి 10 -- తెలుగులో టాప్ సీరియల్ గా కొనసాగుతున్న కార్తీక దీపం 2కు ఫ్యాన్స్ ఎక్కువే. ఈ సీరియల్ ను రెగ్యులర్ గా ఫాలో అయ్యే వాళ్లకు ఇందులోని సుమిత్ర, కాంచన క్యారెక్టర్ల బాగా తెలుసు. సీరియల్ లో ఎమోషన్ తో కంటతడి పెట్టిస్తారు వీళ్లిద్దరు. కానీ బయట మాత్రం తీన్ మార్ డ్యాన్స్ తో అదరగొట్టారు.

స్టార్ మాలో వస్తున్న కార్తీక దీపం 2 సీరియల్ లో సుమిత్ర పాత్రను సీత, కాంచన క్యారెక్టర్ ను స్వర్ణ ప్లే చేస్తున్నారు. ఇందులో సుమిత్ర ఏమో కార్తీక్ కు మేనత్త, దీపకు తల్లి. కాంచన ఏమో కార్తీక్ కు తల్లి. ప్రస్తుతం సీరియల్ లో సుమిత్రకు బ్లడ్ క్యాన్సర్ అని తెలుస్తుంది. దీని ట్రీట్మెంట్ చుట్టూ ఎమోషనల్ గా స్టోరీ సాగుతోంది. సుమిత్ర ట్రీట్మెంట్ కోసం తమ బిడ్డ ప్రాణాలు పోగొట్టుకోవాల్సిన పరిస్థితుల్లో దీప, కార్తీక్ ఉంటారు.

కార్తీక దీపం 2 సీరియల్ లో ఎమోషనల్ యాక్...