భారతదేశం, ఏప్రిల్ 16 -- తదుపరి సీజేఐగా జస్టిస్ భూషణ్ రామకృష్ణ గవాయ్ పేరును భారత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సంజీవ్ ఖన్నా కేంద్ర న్యాయ మంత్రిత్వ శాఖకు సిఫారసు చేశారు. ప్రస్తుత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఖన్నా పదవీ విరమణ చేసిన మరుసటి రోజైన మే 14వ తేదీన జస్టిస్ గవాయ్ సుప్రీంకోర్టు 52వ ప్రధాన న్యాయమూర్తిగా ప్రమాణ స్వీకారం చేయనున్నారు. జస్టిస్ గవాయ్ ప్రమాణ స్వీకారం చేస్తే సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా బాధ్యతలు చేపట్టిన రెండో దళితుడిగా చరిత్ర సృష్టించనున్నారు. ఆయన కంటే ముందు జస్టిస్ కేజీ బాలకృష్ణన్ అనే మరో దళితుడు 2007లో దేశ అత్యున్నత న్యాయస్థానానికి ప్రధాన న్యాయమూర్తి అయ్యారు.

సంప్రదాయం ప్రకారం ప్రధాన న్యాయమూర్తి తన రిటైర్మెంట్ అనంతరం సీజేఐ గా ఎవరిని ఎంపిక చేయాలనే విషయంలో కేంద్ర న్యాయ మంత్రిత్వ శాఖకు ప్రతిపాదన పంపుతారు. జస్టిస్ ఖన్నా 2024...