భారతదేశం, జూన్ 30 -- సున్నం చెరువు పున‌రుద్ధ‌ర‌ణ ప‌నుల‌ను హైడ్రా స్పీడ‌ప్ చేసింది. ఈ క్ర‌మంలో ఫుల్ ట్యాంక్ ప‌రిధిలో మిగిలిన ఆక్ర‌మ‌ణ‌ల‌ను సోమ‌వారం తొల‌గించింది. విష‌తుల్యం అని తెలిసినా.. సున్నం చెరువు ఆవ‌ర‌ణ‌లో బోర్ల ద్వారా నీటి వ్యాపారం చేస్తున్న వారిపై చ‌ర్య‌లు తీసుకుంది. ప‌దుల సంఖ్య‌లో ఉన్న బోర్ల‌ను తొల‌గించ‌డ‌మే కాకుండా.. ట్యాంక‌ర్ల‌ను సీజ్ చేసింది. బోర్లుకు ఆనుకుని వేసిన షెడ్డుల‌ను కూడా హైడ్రా తొల‌గించింది. పీసీబీ ద్వ‌రా ప‌రీక్ష‌లు చేయించి.. అక్క‌డి నీరు చాలా ప్ర‌మాద‌క‌ర‌మ‌ని వివ‌రించినా ప‌ట్టించుకోకుండా నీటి దందా చేస్తున్న‌వారిపై కేసులు పెట్టింది. ఎవ‌రి ఆరోగ్యాలు ఎలా పాడైనా ఫ‌ర్వాలేదు.. త‌న నీటి వ్యాపారం కొన‌సాగ‌డ‌మే చాలు అని హైడ్రా విదుల‌కు ఆటంకం క‌లిగిస్తున్న‌ వెంక‌టేష్‌పై మాధాపూర్ పోలీసుల‌కు హైడ్రా ఫిర్యాదు చేసింది. ఈ మేర‌కు వెంక...