భారతదేశం, నవంబర్ 23 -- పార్కింగ్ వంటి సినిమాలతో అలరిస్తున్నాడు తమిళ హీరో హరీష్ కల్యాణ్. ఇలా వైవిధ్యమైన సినిమాలో ఆక‌ట్టుకుంటోన్న యంగ్ హీరో హ‌రీష్ కల్యాణ్ క‌థానాయ‌కుడుగా నటించిన లేటెస్ట్ మూవీ 'దాషమకాన్'.

ఐడీఏఏ ప్రొడ‌క్ష‌న్స్‌, థింక్ స్టూడియోస్ బ్యాన‌ర్స్‌పై మాస్ యాక్ష‌న్ ఎంట‌ర్‌టైన‌ర్‌గా దాషమకాన్ తెరకెక్కుతోంది. వినీత్ వ‌ర‌ప్ర‌సాద్ స్వీయ ద‌ర్శ‌క నిర్మాణంలో ఈ సినిమాను రూపొందిస్తున్నారు. తెలుగు, త‌మిళ రెండు భాష‌ల్లో దాషమకాన్ సినిమాను విడుదల చేస్తున్నారు.

ఈ సందర్భంగా తాజాగా శనివారం (నవంబర్ 22) నాడు దాషమకాన్ టైటిల్ ప్రోమోను మేక‌ర్స్ విడుద‌ల చేశారు. డిఫరెంట్ యాక్షన్ ఎలిమెంట్‌తో దాషమకాన్ టైటిల్ ప్రోమో అదిరిపోయింది. టైటిల్ ప్రోమోను గ‌మ‌నిస్తే.. ఊర్లో పేరు మోసిన రౌడీకి చెందిన కిరాయి మ‌నుషులు హీరోని వెతుక్కుంటూ.. ఎలాగైనా చంపాల‌ని ఆయుధాల‌తో వెంబ‌డి...