భారతదేశం, జనవరి 11 -- భారతదేశ ఎలక్ట్రిక్ స్కూటర్ రంగం ఇప్పుడు వివిధ మోడల్స్​తో కళకళలాడిపోతోంది. ఒకప్పుడు కేవలం స్టార్టప్‌ల ప్రయోగశాలగా ఉన్న ఈ విభాగం.. నేడు దిగ్గజ తయారీ సంస్థల రాకతో యుద్ధ క్షేత్రంగా మారింది. ఓలా ఎలక్ట్రిక్, ఏథర్ ఎనర్జీ వంటి కంపెనీలు మొదట్లో గట్టి పునాది వేయగా.. టీవీఎస్ ఐక్యూబ్, బజాజ్ చేతక్ వంటి మోడళ్లతో పాత తరం సంస్థలు తమ ఉనికిని చాటుకున్నాయి.

ఇప్పుడు మరో కొత్త అంకం మొదలైంది. సుజుకీ సంస్థ తన 'ఇ-యాక్సెస్' ఎలక్ట్రిక్​ స్కూటర్​ని ఇటీవలే లాంచ్ చేసింది. దీనితో వాహనదారులకు ఆప్షన్లు పెరిగాయి. మరి కొత్తగా వచ్చిన సుజుకీ ఇ-యాక్సెస్, ప్రస్తుతం ఫ్యామిలీ స్కూటర్ సెగ్మెంట్‌లో దుమ్మురేపుతున్న ఏథర్ రిజ్టాకు ఏ మేర పోటీ ఇవ్వనుంది? ఈ రెండు ఎలక్ట్రిక్​ స్కూటర్లలో ఏది బెస్ట్​? ఓసారి చూద్దాము..

ధర విషయంలో సుజుకీ తన ఇ-యాక్సెస్‌ను కాస్త ప్రీమి...