భారతదేశం, జనవరి 9 -- భారత టూ-వీలర్ మార్కెట్‌లో తిరుగులేని ముద్ర వేసిన జపాన్ దిగ్గజం సుజుకి, ఇప్పుడు ఎలక్ట్రిక్ వాహనాల (EV) రేసులోకి అధికారికంగా అడుగుపెట్టింది. తన పాపులర్ మోడల్ 'యాక్సెస్'ను ఎలక్ట్రిక్ రూపంలో 'e-Access' పేరుతో భారత మార్కెట్లో విడుదల చేసింది. ఈ స్కూటర్ ధరను రూ. 1,88,490 (ఎక్స్-షోరూమ్) గా నిర్ణయించింది. గతేడాది భారత్ మొబిలిటీ గ్లోబల్ ఎక్స్‌పో 2025లో అందరి దృష్టిని ఆకర్షించిన ఈ మోడల్, ఇప్పుడు వినియోగదారులకు అందుబాటులోకి వచ్చింది.

మీరు కొత్తగా సుజుకి e-Access కొనాలనుకుంటున్నారా? అయితే ఈ స్కూటర్ గురించి మీరు తెలుసుకోవాల్సిన టాప్ 5 విషయాలు ఇక్కడ ఉన్నాయి.

సుజుకి e-Access ఎలక్ట్రిక్ స్కూటర్ ప్రారంభ ధర రూ. 1,88,490 (ఎక్స్-షోరూమ్). ఈ స్కూటర్ కొనాలనుకునే వారు దేశవ్యాప్తంగా ఉన్న అధీకృత సుజుకి డీలర్‌షిప్‌ల వద్ద బుక్ చేసుకోవచ్చు. ప్రత...