Hyderabad, అక్టోబర్ 2 -- పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటించిన లేటెస్ట్ మూవీ ఓజీ సూపర్ హిట్ టాక్‌తో దూసుకుపోతోంది. సుజీత్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమాను డీవీవీ దానయ్య, కళ్యాణ్ దాసరి నిర్మించారు. తాజాగా అక్టోబర్ 1న ఓజీ విజయోత్సవ వేడుకను గ్రాండ్‌గా నిర్వహించారు. ఈ ఈవెంట్‌లో పవన్ కల్యాణ్ ఇంట్రెస్టింగ్ విషయాలు చెప్పారు.

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ మాట్లాడుతూ.. "ముందుగా ఇక్కడకి వచ్చిన మీడియా వాళ్లకి, అభిమానులకి, స్నేహితులకి, సోదర సోదరీమణులు అందరికీ ఓజీ యూనిట్ తరఫున నా హృదయపూర్వక నమస్కారాలు. ఓజీ సినిమా అనేది మా అందరికి చాలా చక్కటి అనుభూతి" అని అన్నారు.

"చాలా అరుదుగా సినిమాలు హిట్ అవుతూ ఉంటాయి, గ్రేట్ కలెక్షన్స్ వస్తుంటాయి. కానీ, ఒక సెలబ్రేషన్ లాగా ఒక సినిమా రిలీజ్ అవ్వడం చాలా తక్కువ సార్లు జరుగుతూ ఉంటుంది. అలాంటి అవకాశం మాకు లభించినందుకు చాలా ఆనంద...