భారతదేశం, మే 15 -- సాంస్కృతిక వారసత్వం, ఇక్కత్ చీరల నేతకు ప్రపంచ ప్రసిద్ధి చెందిన భూదాన్ పోచంపల్లి గ్రామ చేనేత పార్క్ ఈసారి అంతర్జాతీయ సుందరీమణుల మన్ననలు పొందింది.

గురువారం ఆఫ్రికా ఖండం నుంచి వచ్చిన 25 దేశాల మిస్ వరల్డ్ పోటీదారులు ఈ గ్రామాన్ని సందర్శించి, స్థానిక సంస్కృతి, కళలతో, మ్యూజిక్ తో మమేకమయ్యారు. సిందూరం, సంగీతం, చేతినేతల మధ్య కళాత్మకమైన ఈ సందర్శనం అతిథుల హృదయాలను రంజింపజేసింది.

భూదాన్ పోచంపల్లి గ్రామ చేనేత పార్క్ ప్రవేశద్వారం వద్దే స్థానికులు సంప్రదాయ దుస్తుల్లో కంటెస్టెంట్లకు స్వాగతం పలికారు. సిందూరం నుదుట దిద్ది, పువ్వుల మాలలు అందిస్తూ "పోచంపల్లికి హృదయపూర్వక స్వాగతం" అంటూ అందగత్తెలకు హృదయాలను హత్తుకునేలా ఆత్మీయ స్వాగతం పలికారు. ఈ సందర్భంగా పార్క్ మ్యూజియంలోని స్టాల్ లను సందర్శించారు.

ప్రత్యేకమైన ఇక్కత్ చీరల తయారీ విధానాన్ని...