భారతదేశం, జూన్ 16 -- మీకు తరచుగా కడుపు ఉబ్బరం, అసిడిటీ, లేదా అజీర్తి సమస్యలు బాధిస్తున్నాయా? అయితే మీ వంటింట్లోనే ఒక అద్భుతమైన పరిష్కారం ఉంది. అదే జీలకర్ర (Cumin), ధనియాలు (Coriander), సోంపు (Fennel) గింజలతో తయారుచేసే సీసీఎఫ్ టీ. ఇది కేవలం ఒక మామూలు పానీయం కాదు, ఆయుర్వేదంలో దీనికి ప్రత్యేక స్థానం ఉంది. శరీరంలోని మలినాలను బయటకు పంపడానికి, జీర్ణశక్తిని పెంచడానికి ఇది చాలా బాగా పనిచేస్తుంది. అందుకే ఆరోగ్య ప్రియులందరూ దీన్ని ఇష్టపడతారు. బాలీవుడ్ నటి శిల్పాశెట్టి కూడా తన జీర్ణవ్యవస్థ ఆరోగ్యంగా ఉండటానికి ఈ టీనే తాగుతారట.

సీసీఎఫ్ టీ శరీరంలోని మూడు దోషాలైన వాత, పిత్త, కఫాలను సమతుల్యం చేసి, జీర్ణక్రియను మెరుగుపరుస్తుందని ఆయుర్వేదం చెబుతోంది.

ఆయుర్వేదం ప్రకారం, ఆరోగ్యం అనేది వాత, పిత్త, కఫ దోషాల సమతుల్యతతోనే మొదలవుతుంది. "సీసీఎఫ్ టీ ఈ మూడు దోషాలన...