భారతదేశం, డిసెంబర్ 30 -- కన్నడ టెలివిజన్ పరిశ్రమలో తీవ్ర విషాదం నెలకొంది. 26 ఏళ్ల కన్నడ టెలివిజన్ నటి నందిని సీఎం సూసైడ్ చేసుకుంది. బెంగళూరులోని తన పేయింగ్ గెస్ట్ అకామడేషన్‌లో సోమవారం (డిసెంబర్ 29) ఆమె ఆత్మహత్య చేసుకున్నట్లు పోలీసులు తెలిపారు. వార్తా సంస్థ పీటీఐ.. పోలీసులను ఉటంకిస్తూ, ఈ సంఘటన కెంగేరి ప్రాంతంలో జరిగిందని చెప్పింది.

కన్నడ సీరియల్ నటి నందిని సీఎం సూసైడ్ చేసుకుంది. సంఘటనా స్థలంలో డెత్ నోట్ లభించింది. స్వాధీనం చేసుకున్న ఈ డెత్ నోట్ ఆధారంగా సీనియర్ పోలీసు అధికారి ఒకరు నందిని డిప్రెషన్, వ్యక్తిగత సమస్యలతో పోరాడుతోందని పేర్కొన్నారు. ఈ నోట్‌లో ఆమె వివాహం చేసుకోవడానికి లేదా ప్రభుత్వ ఉద్యోగం చేయడానికి ఇష్టపడలేదని పేర్కొందని తెలిపారు.

నందిని సీఎం యాక్టింగ్ కెరీర్ ను కొనసాగించాలని అనుకుంది. కానీ ఆమె ఫ్యామిలీ మాత్రం నందిని త్వరగా సెట...