భారతదేశం, ఏప్రిల్ 24 -- టాలీవుడ్ సీనియ‌ర్ హీరో సుమ‌న్ బుల్లితెర‌పైకి ఎంట్రీ ఇస్తోన్నారు. అది కూడా క‌న్న‌డ సీరియ‌ల్ ద్వారా టీవీలోకి అడుగుపెట్ట బోతున్నారు. త్రిన‌య‌ని సీరియ‌ల్ ఫేమ్ చందు గౌడ క‌న్న‌డంలో స్నేహ‌ద క‌డ‌ల‌ల్లి పేరుతో ఓ సీరియ‌ల్ చేస్తోన్నాడు. స్టార్ సువ‌ర్ణ ఛానెల్‌లో ఈ సీరియ‌ల్ టెలికాస్ట్ కాబోతుంది.ఈ సీరియ‌ల్‌కు సంబంధించిన ప్రోమోను ఇటీవ‌ల రిలీజ్ చేశారు.

ఈ సీరియ‌ల్‌లో టాలీవుడ్ సీనియ‌ర్ హీరో సుమ‌న్ ఓ కీల‌క పాత్ర‌లో క‌నిపించ‌బోతున్నాడు. ఇటీవ‌ల రిలీజ్ చేసిన ప్రోమోలో సుమ‌న్ క‌నిపించారు. లీడ్ యాక్ట‌ర్‌గా న‌టిస్తోన్న చందు గౌడ‌కు తండ్రి పాత్ర‌లో సుమ‌న్ క‌నిపించ‌బోతున్న‌ట్లు ప్ర‌చారం జ‌రుగుతోంది. సీరియ‌ల్‌లో సుమ‌న్‌ది ఫుల్ లెంగ్త్ రోల్ అని స‌మాచారం.స్నేహ‌ద క‌డ‌ల‌ల్లి సీరియ‌ల్‌లో కావ్య మ‌హ‌దేవ్ హీరోయిన్‌గా న‌టిస్తోంది.

ప్రోమోలో కావ్య మ‌హ‌ద...