Hyderabad, ఏప్రిల్ 24 -- సినిమాల్లో హీరో హీరోయిన్స్‌గా నటించిన పాపులర్ యాక్టర్స్ అదే మూవీస్‌లో అన్నా చెల్లెలి పాత్రల్లో, తల్లీకొడుకులుగా నటించిన సందర్భాలు ఎన్నో ఉన్నాయి. తెలుగులోనే సైరా నరసింహా రెడ్డి సినిమాలో చిరంజీవికి హీరోయిన్‌గా నటించిన నయనతార గాడ్ ఫాదర్ మూవీలో చెల్లెలిగా నటించిన విషయం తెలిసిందే.

అయితే, ఇదంతా సినీ ఇండస్ట్రీలో చాలా సాధారణమైన విషయం. కానీ, తల్లికొడుకులుగా నటించిన వారు నిజంగా భార్యాభర్తలు అవడం అనేది చాలా ఆశ్చర్యకరమైన విషయం. అయితే, ఇది నిజంగానే జరిగింది. ఓ సీరియల్‌లో తల్లికొడుకులుగా నటించిన ఇద్దరు రియల్ లైఫ్‌లో భార్యాభర్తలుగా మారారు. వారే హిందీ టెలివిజన్ యాక్టర్స్, మోడల్స్ అయిన కిష్వర్ మర్చంట్ (44), సుయాష్ రాయ్ (36).

సుయాష్ రాయ్ కంటే కిష్వర్ మర్చంట్ 8 సంవత్సరాలు పెద్దది. కానీ, లవ్, మ్యారేజ్‌కు అదేం అడ్డు కాదని అనేక సవాళ్...