భారతదేశం, జూలై 4 -- కామన్ యూనివర్సిటీ ఎంట్రన్స్ టెస్ట్ అండర్ గ్రాడ్యుయేట్ (CUET UG) 2025 ఫలితాలను నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (NTA) శుక్రవారం విడుదల చేసింది. పరీక్షకు హాజరైన అభ్యర్థులు సీయూఈటీ అధికారిక వెబ్సైట్ cuet.nta.nic.in లో తమ ఫలితాలను చూసుకోవచ్చు. కౌన్సెలింగ్ ప్రక్రియలో పాల్గొనడానికి ఈ స్కోర్ కార్డ్ చాలా అవసరం. జూలై 1న సీయూఈటీ-యూజీ ఫైనల్ ఆన్సర్ కీని విడుదల చేసింది. అభ్యర్థులు తమ స్కోర్లను విశ్లేషించుకోవడానికి అధికారిక వెబ్సైట్ నుంచి డౌన్లోడ్ చేసుకోవచ్చు.

వ్యక్తిగత స్కోర్ కార్డులను డౌన్లోడ్ చేసుకోవడానికి అభ్యర్థులకు అప్లికేషన్ నంబర్, పుట్టిన తేదీ అవసరం అవుతాయి. మే 13 నుంచి జూన్ 3 వరకు సీబీటీ విధానంలో 13 భాషలు, 23 డొమైన్ సబ్జెక్టులు, జనరల్ ఆప్టిట్యూడ్ టెస్ట్ నిర్వహించారు. పరీక్ష విధానం ఆబ్జెక్టివ్ టైప్ ప్రశ్నలు (ఎంసీక్యూ) ఆధారంగా ఉంది....