Andhrapradesh, జూలై 17 -- నంద్యాల జిల్లాలోని పంపింగ్ స్టేషన్-1 నుంచి హంద్రీనీవా సుజల స్రవంతి (హెచ్ఎన్ఎస్ఎస్) కాలువలోకి గురువారం సీఎం చంద్రబాబు కృష్ణా జలాలను విడుదల చేశారు. నీటి విడుదల అనంతరం. ముఖ్యమంత్రి హంద్రీనీవా జలాలకు పూజలు చేశారు.

హెచ్ఎన్ఎస్ఎస్ పంపింగ్ స్టేషన్-1 ద్వారా హంద్రీనీవా సుజల స్రవంతి కాలువలోకి కృష్ణా జలాలను విడుదల చేశారు. రూ.696 కోట్లతో చేపట్టిన హంద్రీనీవా ఫేజ్-1 కాలువ పనులు పూర్తికావడంలో నీటి విడుదల కీలక మైలురాయిగా నిలిచింది. కాలువ వెడల్పుతో ప్రవాహ సామర్థ్యం 3,850 క్యూసెక్కులకు పెరిగినట్లు అధికారులు తెలిపారు.

కరువు పీడిత రాయలసీమ ప్రాంతానికి సాగు, తాగునీటి అవసరాలను తీర్చేందుకు హెచ్ఎన్ఎస్ఎస్ ప్రాజెక్టు మొదటి, రెండో దశల కింద రాష్ట్రం రూ.3,890 కోట్లు వెచ్చిస్తోంది.

ముందు ప్రకటించినట్టుగానే వంద రోజుల్లో ఈ కాలువ విస్తరణ పనుల ల...