భారతదేశం, ఆగస్టు 15 -- న్యూఢిల్లీ: ఇటీవలి నీట్ యూజీ 2024 ప్రశ్నాపత్రం లీకేజ్ కేసు దర్యాప్తులో కీలకంగా వ్యవహరించిన సీబీఐ అదనపు పోలీసు సూపరింటెండెంట్ (ఏఎస్పీ) బండి పెద్దిరాజుకు ప్రతిష్ఠాత్మక రాష్ట్రపతి విశిష్ట సేవా పతకం లభించింది. భారత 79వ స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా ఈ పురస్కారాన్ని కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. పోలీస్ లేదా భద్రతా దళాల్లో అసాధారణమైన సేవలందించిన అధికారులకు ఏటా ఈ అవార్డును ప్రదానం చేస్తారు.

పశ్చిమ గోదావరి జిల్లా శృంగవృక్షం (బంటుమిల్లి) గ్రామానికి చెందిన బండి పెద్దిరాజు 1993లో సీబీఐలో కానిస్టేబుల్‌గా చేరారు. అంచెలంచెలుగా ఎదుగుతూ 1997లో ఎస్ఐ, 2003లో ఇన్‌స్పెక్టర్, 2016లో డీఎస్పీ, 2023లో ఏఎస్పీ స్థాయికి చేరుకున్నారు. ఆయన 32 ఏళ్ల సర్వీసులో అనేక సంచలనాత్మక కేసులను సమర్థవంతంగా దర్యాప్తు చేశారు.

సంచలనాత్మక కేసులు: పరిటాల రవి ...