భారతదేశం, డిసెంబర్ 30 -- కేంద్ర మాధ్యమిక విద్యా మండలి (CBSE) 2026 బోర్డు పరీక్షల షెడ్యూల్‌లో కీలక మార్పులు చేసింది. మార్చి 3న జరగాల్సిన 10వ తరగతికి చెందిన 13 సబ్జెక్టులు, 12వ తరగతికి చెందిన ఒక ప్రధాన సబ్జెక్టు పరీక్షలను రీషెడ్యూలు చేస్తున్నట్లు ప్రకటించింది. పరిపాలనా కారణాల దృష్ట్యా ఈ మార్పులు చేసినట్లు బోర్డు స్పష్టం చేసింది.

స్కూల్ ప్రిన్సిపాల్‌లకు పంపిన తాజా సమాచారం ప్రకారం, మార్చి 3న జరగాల్సిన పరీక్షల కొత్త తేదీలు ఇలా ఉన్నాయి:

10వ తరగతి: టిబెటన్, జర్మన్, నేషనల్ క్యాడెట్ కోర్ (NCC), భోటి, బోడో, తంగ్ఖుల్, జపనీస్, భూటియా, స్పానిష్, కాశ్మీరీ, మిజో, బాసా మెెలాయు, ఎలిమెంట్స్ ఆఫ్ బుక్ కీపింగ్ అండ్ అకౌంటెన్సీ.. ఈ 13 సబ్జెక్టుల పరీక్షలు ఇప్పుడు మార్చి 11న జరుగుతాయి.

12వ తరగతి: మార్చి 3న జరగాల్సిన 'లీగల్ స్టడీస్' పరీక్షను ఏప్రిల్ 10వ తేదీకి ...