భారతదేశం, మే 20 -- 2025 సంవత్సరం 10వ తరగతి, 12 వ తరగతి ఫలితాల్లో సాధించిన మార్కుల వెరిఫికేషన్, రీవాల్యుయేషన్ లకు విద్యార్థులు దరఖాస్తు చేసుకునే తేదీలను సెంట్రల్ బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ సీబీఎస్ఈ ప్రకటించింది. సీబీఎస్ఈ 10వ తరగతి లేదా సీబీఎస్ఈ 12వ తరగతి విద్యార్థులు తమకు వచ్చిన మార్కుల విషయంలో ఏదైనా అసంతృప్తి ఉంటే, రీ వెరిఫికేషన్ లేదా రీ వాల్యుయేషన్ కు దరఖాస్తు చేసుకోవచ్చు. సబ్జెక్టుల వారీగా దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. దరఖాస్తు ఫీజు ఉంటుంది.

రీ వెరిఫికేషన్ లేదా రీ వాల్యుయేషన్ కు దరఖాస్తు చేసుకోవాలనుకునే విద్యార్థులు సీబీఎస్ఈ అధికారిక వెబ్సైట్ cbse.gov.in లో అధికారిక ప్రకటనను చూడవచ్చు. విద్యార్థులు మొదటి దశలో కోరుకున్న సబ్జెక్టుల స్కాన్ చేసిన సమాధాన పుస్తకాన్ని అభ్యర్థించి మార్కుల వెరిఫికేషన్ కు కానీ, రీవాల్యుయేషన్ కు కానీ, లేదా రెం...